బాలకృష్ణ పోటీ చేయరు: టీడీపీ వర్గాలు
posted on Apr 12, 2014 @ 11:28AM
ఈ ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ పోటీ చేసే అవకాశాలు లేవని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ పోటీ చేయాలన్న ఆసక్తి అభిమానులలో బాగా వుంది. బాలకృష్ణ కూడా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఉత్సాహం చూపించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా వుండటం వల్ల బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేయడం కంటే విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం విజయానికి తోడ్పడితే మంచిదన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమయినట్టు తెలుస్తోంది. తన పోటీ విషయంలో పార్టీలో భిన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో బాలకృష్ణ మొదట్లో మనసు కష్టపెట్టుకున్నప్పటికీ, పరిస్థితిని అర్థం చేసుకుని పోటీ యోచనను విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ క్షణం వరకూ బాలకృష్ణ పోటీ చేసే అవకాశం లేదని వారు అంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాలకృష్ణ పోటీ చేసే అవకాశం లేదని వారు చెబుతున్నారు.