రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 43 మంది మృతి..
posted on Jan 12, 2016 @ 1:54PM
ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఎస్ ఉగ్రవాదులు మారణహోమం చేశారు. బాగ్దాద్‌లోని అల్ జదిదా షాపింగ్‌మాల్‌లో ఉగ్రవాదులు భీకర కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు షాపింగ్ మాల్ ల్లోనే దాక్కోవడంతో భద్రతా బలగాలు భవనం పైనుంచి లోపలికి ప్రవేశించి ఎదురుకాల్పులు చేస్తున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క చోటే కాకుండా బాగ్దాద్ లో పలుచోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆగ్నేయ బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే మార్కెట్‌లో కారు బాంబు పేల్చడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ప్రాంతంలో హోటల్‌వద్ద బాంబు దాడికి పాల్పడటంతో సుమారు 20 మంది మృతిచెందారు. మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారు.