ఈ బాబా చెప్పినవన్నీ జరిగాయి
posted on Jul 17, 2022 @ 11:39AM
జీవితంలో అన్నీ అనుకున్నట్టే జరగవు, ఊహించనివే ఎక్కువ జరుగుతాయి అంటూంటారు తత్వవేత్తలు. అందుకనే ఎలాంటి తట్టుకోలేని కష్టం వచ్చినా దేవుడి దగ్గరకో, మనసుకు శాంతి కలిగించే నమ్మకమైన బాబాల దగ్గరకో వెళ్లడం మనలో చాలా మందికి అలవాటు. ఇది వారి వ్యక్తిగత ఆలోచన, నమ్మకాల మీదనే ఆధారపడివుంటుంది. కొందరికి కొన్ని అతీతశక్తులు ఇప్ప టికీ వున్నాయన్నది అపుడపుడు రుజువవుతుంటుంది. ఇలాంటివి ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే వింటాం, చూస్తాం. ఇలాంటి బాబాయే బాబా వాంగా. ఆమె అసలు పేరు వంగెలియా పందెవా గుస్టరోవా
ప్రతీవారికి తమ భవిష్యత్తు తెలుసుకోవాలన్న కోరిక ఉంటుంది. దానికి పేద, ధనిక అనే తేడాలుండవు. కొందరు కొందరిని ఎంతో నమ్ముతారు. కొందరు చెప్పినవి చెప్పినట్టు జరుగుతూంటాయి కూడా. కొన్నిసార్లు అందరం నమ్మవలసి వస్తుంది. బల్గేరియా వాసులు బాబా వాంగా వద్దకు వెళుతూంటారు. ఆమె పట్ల వారికి అపార నమ్మకం. ఎందుకంటే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఉగ్ర వాదుల దాడుల గురించి ఆమె ముందే చెప్పారు. సరిగ్గా అలానే జరి గింది. ఇలాంటివి ఆమె ఎన్నో చెప్పారు.
బాబా వాంగాని సిద్ధగురువుగా బల్గేరియా ప్రజలు భావిస్తారు. అంతెందుకు ఇటీవల జరిగినవాటిలో దాదాపు అన్నీ ఆమె ముందే చెప్పారట. 2022లొ జరిగేవి అన్నీ చెప్పారట. ఆమె చెప్పినట్టే ఇప్పటి వరకూ జరగడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె ను అందరూ బాల్కన్ల నోస్ట్రాడామస్‌గా పిలుస్తారు. ఈమె 1996లో కనుమూశారు. కానీ ఆమె 5079 వరకూ ప్రపంచ వ్యాప్తంగా జరిగే చాలా సంఘటనలు వివరించిందిట! 2020లో పుతిన్, ట్రంప్ జీవితాల్లో ప్రమాదం ఉందని అలాగే కెమికల్ వార్ వల్ల యూరప్లో మానవాళి ఊహించని ఘోరం జరిగే ప్రమాదం వుందని ఆమె చెప్పారట.
బాబా వాంగా గురించి కథలు కథలుగా బల్గేరియా అంతటా చెప్పుకుంటూంటారు. ఆమెకు ఈ శక్తులు రావడం గురించీ ఒక కథ వుంది. ఒకసారి ఒక తుపాను గాలికి ఆమె చిక్కకున్నారట. ఆ విపరీత గాడుపు ఆమెను ఎత్తి కిందపడేసింది. ఆమె తలకు దెబ్బ తగిలి దుమ్మంతా కళ్లలో పడి చూపు పోయిందట. చిత్రమేమంటే, ఆ దుర్ఘటనే ఆమెకు ఈ అతీతశక్తులు ఇచ్చిందని ప్రచారంలో వుంది.
ఏదేమయినప్పటికీ, బాబా వాంగా చెప్పినవన్నీ జరుగుతుండడంతో ఆమెను దైవదూతగా భావిస్తు్నారు బల్లేరియన్లు. 2020లో ట్రంప్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడతారని ఆమె చెప్పినట్టే జరిగింది. అలాగే రష్యా పుతిన్ పై తన అధికారిక కార్యా లయంలోనే హత్యకు గురవుతారు, లేదా ఆయన తప్పించుకునే అవకాశం కూడా ఎంతో వుందని చెప్పారు. అంతేకాదు యూరప్ ముస్లిం ఉగ్రవాదుల దాడిలో చిత్తవుతుందనీ చెప్పారు. ఆమె చెప్పినవేవీ తప్పలేదు. ఐఎప్ ఐఎస్ వికృత రూపంతో ప్రభావం చూపుతుం దని, అమెరికా 44వ ప్రెసిడెంట్ గా ఆఫ్రికా-అమెరికన్ అవుతాడని వాంగాయే ముందుగా చెప్పారు.
ఇలాంటివారు చాలా అరుదుగా వుంటారు. భారత దేశంలో పూర్వం రుషులు ఇలానే చెప్పేవారని మన పురాణాలు పేర్కొంటు న్నాయి. కానీ ఇలాంటివారిలానే చాలామంది ఇపుడు బాబాలమంటూ దొంగలు తయారవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవర్ని నమ్మాలో అర్ధంగాని సందిగ్ధతా ఏర్పడిన మాటా నిజమే.