తెలంగాణ బిల్లు వస్తుందో లేదో: ఆజాద్
posted on Dec 4, 2013 @ 4:31PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు కృషిచేస్తున్నామని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. జీఓఎం రాష్ట్ర విభజన ప్రక్రియ పైన వేగవంతంగా పనిచేస్తుందని తెలిపారు. కాని తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెట్టేది తనకు తెలియదని వ్యాఖ్యానించడం విశేషం. ఆజాద్ చేసిన వ్యాఖ్యలు బట్టి శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం కష్టంగానె కనిపిస్తోంది. డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల ఎజెండాలో కూడా తెలంగాణ బిల్లు లేదు. అయితే లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా ప్రకటించారు.