ఆజాద్‌కు హోం శాఖ బాధ్యతలు..?
posted on Sep 1, 2013 @ 11:26AM
దేశంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా కేంద్ర హోం శాఖ మంత్రి మార్చే ఆలోచనలో ఉన్నారు. ప్రస్థుతం హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుశీల్‌కుమార్ షిండే స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే ముంబై బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న షిండే ఆరోగ్యకారణాల రీత్యా మంత్రి పదవి నుంచి తప్పించనున్నారు.
ఇప్పటికే చికిత్స జరిగినా షిండే ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోవడంతో విధులకు పూర్తిగా హాజనరు కాలేకపోతున్నారు. దీంతో ప్రస్థుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన హోం శాఖను నిర్వహించగలరా అని అధిష్టానం ఆందోళనలో ఉంది. దీంతో పార్లమెంట్ సమావేశాలు పూర్తి కాగానే హోం శాఖను గులాంనభీ ఆజాద్‌కు అప్పజెప్పనున్నారు.
ఆరోగ్య సమస్యలతో పాటు తెలంగాణ విషయంపై కూడా నోట్ రెడీ చేసే బాధ్యత కూడా షిండే పైనే ఉండటంతో ఆయనను హోం శాఖ నుండి తప్పించి బాధ్యతలు లేని శాఖను అప్పగించే యోచనలో ఉంది అధిష్టానం.