యూరిక్ యాసిడ్ కు, కీళ్ల నొప్పులకు 15రోజుల్లో చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కా..!

 


యూరిక్ యాసిడ్ నేటి కాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్-రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు ఏర్పడే పదార్థం. ఇది రక్తంలో పేరుకుపోతుంది.  శరీరం నుండి తొలగిపోనప్పుడు  ఇది కీళ్లలో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది.  దీని కారణంగా  ఆర్థరైటిస్,  మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవడానికి అనేక వైద్య  చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి.  అయితే ఆయుర్వేద  చిట్కాల ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు. యూరిక్ యాసిడ్‌ తగ్గించడానికి  అల్లోపతి ఔషధాల కంటే ఆయుర్వేద మందులు మెరుగైన ఫలితాలను ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో యూరిక్ యాసిడ్ ను,  కీళ్ల నొప్పులను 15రోజులలో తగ్గించే ఆయుర్వేద ఔషధం గురించి తెలుసుకుంటే..

కావలసిన పదార్థం..

వాము.. 1టీ స్పూన్

తురిమిన అల్లం.. 1టీ స్పూన్

తయారీ విధానం..

రెండు గ్లాసుల నీటిలో ఒక చెంచా వాము,  ఒక స్పూన్  తురిమిన అల్లం వేసి బాగా ఉడికించాలి.  రెండు గ్లాసుల నీరు కాస్తా  ఒక గ్లాసుగా  మిగిలే వరకు ఉడకబెట్టాలి. ఈ నీళ్ళను వడగట్టాలి.

ఎప్పుడు తాగాలి..

వాము గింజలు,  అల్లం ఉడికించిన నీళ్లను ఉదయాన్నే తాగాలి.  దీన్ని ఉపయోగించడం ద్వారా  కేవలం 15 రోజుల్లోనే ఫలితాలను పొందవచ్చు. ఇది ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైన  ఔషధం అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.  15రోజులు ఈ ఔషధాన్ని ఉపయోగించిన తర్వాత యూరిక్ యాసిడ్ స్థాయి పరీక్షిస్తే యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గడాన్ని గమనించవచ్చు.  దీన్ని 15 రోజుల కంటే ఎక్కువ వాడుతుంటే యూరిక్ యాసిడ్ సమస్య పూర్తీగా తగ్గిపోతుందని అంటున్నారు.


                                 *రూపశ్రీ.