Read more!

అబు అజ్మీ వ్యాఖ్యలు దారుణం: నటి ఆయేషా టకియా

 

 

 

రేప్‌కి గురైన మహిళలను, వివాహేతర సంబంధం వున్న మహిళలను, పెళ్ళికి ముందే శృంగార జీవితం గడిపిన అమ్మాయిలను ఉరితీయాలని సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకత అబు అజ్మీ ఇంటినుంచే బయల్దేరింది. అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆయన కోడలు, మాజీ హీరోయిన్ ఆయేషా టకియా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. తన మామ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తాను, తన భర్త ఎంతగానో సిగ్గుపడుతున్నామని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.