Read more!

త్రిపురలో 93 శాతం రికార్డ్ పోలింగ్

 

 

 

 

త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలికి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 93 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఎన్నికల సంఘం అధికారులు చెపుతున్నారు.


త్రిపురలో మొత్తం 23,58,493 మంది ఓటర్లు ఉండగా, 60 మంది సభ్యులు గల అసెంబ్లీకి భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా ముగియనందున ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.16 పార్టీలకు చెందిన 249 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. శాంతిభద్రతల కోసం 250 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు.


పోలింగ్ భారీగా నమోదు కావడంతో అధికార లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్ కూటములు విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా ఐదోసారీ తమకే అధికారం దక్కుతుందని లెఫ్ట్‌ఫ్రంట్, ఈ సారి ఓటర్లు తమనే గెలిపిస్తారని కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి.