Read more!

గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ఆమోదం తెలిపింది.

పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సభలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి సురేశ్‌ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు గ్రామ, వార్డు స్థాయిల్లోనే  ప్రజలకు అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు బిల్లులను కూడా అసెంబ్లీ ఆమోదించింది.