ఆసియా కుబేరుడు అంబానీయే!
posted on Apr 5, 2023 @ 3:00PM
ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 24వ స్థానానికి పడిపోయాడు. 83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ఆసియాలోనే సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ 128 బిలియన్ డాలర్ల సంపదతో గత జనవరి వరకూ ప్రపంపచ ఫోర్బ్స్ అగ్రగామి పాతిక మంది జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అక్రమాలపై నివేదిక సమర్పించడంతో.. అదానీ షేర్లు భారీగా పతనమైన నేపథ్యంలో అదానీ సంపద భారీగా తరిగి.. ప్రపంచ కుబేరుల జాబితాలో 24 వ స్థానానికి పడిపోయాడు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోఫ్ మూడవ స్థానంలో, ఎలన్ మస్క్ రెండవ స్థానంలో ఉన్నారు. ఫ్రాన్స్ విలాస వస్తువుల వ్యాపారవేత్త ఎల్పీఎం హెచ్ ఆధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ 211 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు.
మస్క్ (180 డాలర్లు) బెజోస్ (114 బీ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఫోర్బ్స్ 2023 జాబితాలో 169 మంది భారతీ యులు చోటు దక్కించుకున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 160గా ఉండింది.