షీలా దీక్షిత్ పై కేజ్రీవాల్ ఘనవిజయం
posted on Dec 8, 2013 @ 12:49PM
అమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై 8,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.ముఖ్యమంత్రి షీలా దీక్షిత్పైనే పోటీకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ మొదట కాస్త వెనకబడినట్లు కనిపించినా, మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సామాన్య మానవుడే ఇక్కడ గెలిచాడని, కాంగ్రెస్ అరాచకాలకు సరైన సమాధానం చెప్పాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రతీకారం తీర్చుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. మొత్తం 70 స్థానాల్లో 23 స్థానాల్లో అమ్ అద్మీ పార్టీ (ఏఏపీ) ఆధిక్యంలో కొనసాగుతోంది.