సత్యేంద్ర జైన్ సమన్లపై కేజ్రీవాల్ ఆగ్రహం... కుట్రను బయటపెడతా
posted on Sep 27, 2016 @ 5:18PM
సత్యేంద్ర జైన్ సమన్లపై కేజ్రీవాల్ ఆగ్రహం... కుట్రను బయటపెడతా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సత్యేంద్ర జైన్ అమాయకుడని.. ఆయనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు ఈరోజు ఉదయం తాను జైన్‌తో మాట్లాడానని, అన్ని పత్రాలు పరిశీలించానని, జైన్ అమాయకుడని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ జైన్ దోషి అయితే.. పదవి నుంచి తొలగించేవాళ్లమన్నారు. జైన్‌కు తమ మద్దతు ఉంటుందని.. ఆప్ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రను బయటపెడతానంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘పలువురు ఆప్ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతున్నారు, నాపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు, సీబీఐ దాడులు చేశారు.. ఎందుకిలా..’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని, అదేంటో శుక్రవారం దిల్లీ అసెంబ్లీలో వెల్లడిస్తానని ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు.