సీఎం ఇల్లు ఖాళీ చేస్తున్న కేజ్రీవాల్
posted on Jun 14, 2014 @ 5:18PM
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని అయితే వదిలిపెట్టాడుగానీ, ముఖ్యమంత్రి హోదాలో తనకు కేటాయించిన ఇంటిని మాత్రం ఖాళీ చేయకుండా ఇంతకాలం దర్జాగా అందులోనే వుంటున్నాడు. ఈ నివాసాన్ని ఖాళీ చేయాలని గతంలోనే ఢిల్లీ ప్రభుత్వ అధికారులు కేజ్రీవాట్‌ని కోరారు. ఒకవేళ ఖాళీ చేయడం కుదరని పక్షంలో నెలకు 85 వేల రూపాయల అద్దె చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అయితే కేజ్రీవాల్ తన కూతురు ప్లస్ టూ పరీక్షలు ఉన్నందున ఇప్పుడు తాను ఇల్లు ఖాళీ చేయలేనని ప్రభుత్వ అధికారులకు తెలిపాడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూతురు ప్లస్ టూ పరీక్షలతోపాటు ఐఐటీ ఎంట్రన్స్ కూడా రాసేసింది. దీంతో కేజ్రీవాల్‌కి ఇల్లు ఖాళీ చేయక తప్పలేదు. త్వరలో తూర్పు ఢిల్లీలోని నివాసానికి మారడానికి కేజ్రీవాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ కొత్త ఇంటిని వెతుక్కుంటున్నారు. త్వరలో ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీచేస్తారు అని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్పాయి.