రాహుల్ బుర్ర లేని మేధావి
posted on Aug 13, 2015 @ 4:49PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఈ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అందరికి స్పష్టంగా అర్ధమవుతోంది. సమావేశాలు పారంభమైన దగ్గరనుండి కాంగ్రెస్ నేతలు ఒక్కరోజు కూడా సభను సాజావుగా సాగనివ్వకుండా పార్లమెంట్ లో రచ్చ రచ్చ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలపై వైఖరిపై మండిపడుతున్నారు. అసలు దీనంతటికి తెరవెనుక ఉండి నడిపిస్తుంది రాహుల్ గాంధీ అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే ఈ విషయంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి వయసు పెరుగుతున్నా బుర్ర పెరగడం లేదని.. వయసు పెరుగుతున్న కొద్దీ రాహుల్‌కు అజ్ఞానం పెరుగుతోందన్నారు. అతనికి సగం తెలిసీ సగం తెలియకుండా మాట్లాడుతున్నారని.. రాహుల్ బుర్ర లేని మేధావని తెలివితేటలు లేని నిపుణుడని చురకలు వేశారు. సగం తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్ల పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయాయని ఆరోపించారు.