ఏపీ ప్రత్యేక ప్యాకేజీపై అలజడి.. 10న రాష్ట్ర బంద్
posted on Sep 8, 2016 @ 11:01AM
నిన్న ఉదయం నుండి చేసిన హైడ్రామాకు కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ అర్థరాత్రి బ్రేక్ వేశారు. ఎలాగూ అటు హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. ఇక ఏపీ ప్రత్యేక ప్యాకేజీ గురించి చేసిన ప్రకటనలో కూడా క్లారిటీ లేదు. దీంతో అటు హోదా ప్రకటించకుండా.. ఇటు ప్యాకేజీ ఇవ్వకుండా జైట్లీ చేసిన ప్రకటనపై ఏపీలో ఇప్పటికే అలజడి మొదలైంది. రాజకీయ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. దీంతో ఈనెల 10న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తూ వామపక్షాలు సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే రోజున జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. ఆ పార్టీలకు మద్దతుగా ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా 10న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈనేపథ్యంలో అన్ని పార్టీలు బంద్ కు పిలువునివ్వడంతో రాష్ట్రమంతటా బంద్ చేపట్టనున్నారు.