కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్
posted on Nov 20, 2022 7:28AM
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియమితులయ్యారు. 1985 పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి గోయల్ ను నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. మూడో పదవి ఖాళీగా ఉండడంతో అరుణ్ గోయల్‌ను కేంద్రం నియమించింది.
ప్రస్తుతం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్, కమిషనర్‌గా అనూప్ చంద్ర పాండే ఉన్నారు.దాదాపు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న మూడో కమిషనర్ పదవిని కేంద్రం అరుణ్ గోయల్‌తో భర్తీ చేసింది. 1985 క్యాడర్‌కు చెందిన అరుణ్ గోయల్ సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.
34 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన అరుణ్ గోయెల్ జీఎస్‌టీ కౌన్సిల్ అడిషనల్ సెక్రెటరీగా కూడా పనిచేశారు. ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివిన అరుణ్ గోయల్ ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో పీజీ పూర్తి చేశారు. వచ్చే నెల మొదటి వారంలో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి,
అలాగే, ఇక వరుసగా మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ, ఆ తరువాత 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దాంతో గత ఆరునెలలుగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా మూడో ఎన్నికల అధికారి పోస్ట్‌ను కేంద్రం భర్తీ చేసింది.