మంత్రి రోజా భర్త సెల్వమణిపై అరెస్టు వారెంట్
posted on Aug 29, 2023 @ 10:46AM
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా భర్తపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. తన పరువుకు నష్టం కలిగించేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారంటూ సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ర్ బోత్రా ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో విచారణకు గైర్హాజర్ కావడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
మంత్రి రోజా భర్త సెల్వమణికి చెన్నై జార్జిటౌన్ కోర్టు అరెస్ట్ వారెంట్.. తన పరువుకి భంగం కలిగేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశాడని సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా ఫిర్యాదు.. కేసు విచారణకు సెల్వమణి, లాయర్ హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
సెల్వమణి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి విదితమే. అయితే ఆయన ఓ కేసులో అరెస్టు అయిన సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్వమణి ముకుంద్ చంద్ బోత్రా కారణంగా తాను పలు ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయంటూ ముకుంద్ చంద్ బోత్రా కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణలో ఉండగానే ముంకుంద్ చంద్ బోత్రా కన్నుమూశారు. అ
యితే ఆయన కుమారుడు గగన్ బోత్రా కేసు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు సోమవారం (ఆగస్టు 28)న విచారణకు వచ్చింది. అయితే ఈ విచారణకు సెల్వమణి కానీ, ఆయన తరఫు న్యాయవాది కానీ హాజరు కాలేదు. గతంలో కూడా వీరు విారణకు గైర్హాజర్ అయ్యారు. దీంతో సెల్వమణి గైర్హాజర్ ను కోర్టు సీరియస్ గా తీసుకుని నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇలా ఉండగా తనపై జారీ అయిన అరెస్టు వారెంట్ పై సెల్వమణి స్పందించలేదు.