ప్రపంచజూనియర్ స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పిన ఆపేక్ష
posted on Sep 2, 2022 @ 10:04AM
భారత యువ మహిళా స్విమ్మర్ ఆపేక్ష ఫెర్నాండెజ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత స్విమ్మర్‌గా రికార్డుల్లోకెక్కింది.
పెరు రాజధాని లిమాలో జరుగుతున్న స్విమ్మింగ్ పోటీల్లో ఆపేక్ష 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగం ఫైనల్లో 2ని.19.14సె.లో గమ్యాన్ని చేరి ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచింది. కాగా అంతకుముందు హీట్స్ లో 2ని.18.18సె. టైమింగ్ నమోదు చేసిన ఆపేక్ష ఉత్తమ భారత మహిళా స్విమ్మర్‌గా రికార్డు లకెక్కింది.
ఈ పోటీల మహిళల 200 మీ. బటర్‌ఫ్లై హీట్స్‌లో 17 ఏళ్ల ఆపేక్ష 2 నిమిషాల 18.18 సెకన్ల భారత అత్యుత్తమ టైమింగ్‌తో ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ, పతక రేస్‌లో 2 నిమిషాల 19.14 సెకన్ల టైమింగ్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్ హీట్స్‌ను తప్పుగా ఆరంభించినందుకు వేదాంత్ మాధవన్ డిస్‌క్వాలిఫై కాగా, సంభవ్ రామారావు 27వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేక పోయాడు.