ఏపీ టోల్ ప్రాజెక్టులు అదానీ వశం
posted on Aug 5, 2022 @ 12:17PM
అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ల్లో 972 కిలోమీటర్ల పొడవైన నాలుగు టోల్‌వే ప్రాజెక్టులను రూ.3,110 కోట్లతో కొనుగోలు చేస్తోంది. మక్వారీ ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనుబంధ సంస్థలైన.. గుజరాత్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (జీఆర్‌ఐసీఎల్), స్వర్ణ టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌టీపీఎల్) నుంచి అదానీ గ్రూప్ ఈ నాలుగు టోల్‌వేలను కొనుగోలు చేస్తోంది. ఇందు లో ఎస్‌టీపీ ఎల్‌కు ఆంధ్రప్రదేశ్ లోని రెండు టోల్‌వే ప్రాజెక్టు ల్లో నూరు శాతం వాటా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తడ-నెల్లూరు (110 కిలోమీటర్లు), నందిగామ-ఇబ్రహీంపట్నం-విజయవాడ (48 కిలోమీ టర్లు) ప్రాజెక్టులు అదానీ గ్రూప్‌నకు మరింత కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన టోల్‌వే ప్రాజెక్టు లను చేజిక్కించుకుంది. ఈ 110 కిలోమీటర్ల పొడవైన టోల్‌వేలో మొత్తం మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి. కృష్ణపట్నం రేవుకు వచ్చిపోయే వాహనాలతో పాటు ఏపీ నుంచి చెన్నై వచ్చిపోయే వాహ నాలతో ఈ రహదారి టోల్‌వే ద్వారా వెళ్లే వాహనాల టోల్ కలెక్షన్లూ ఇక అదానీ గ్రూప్ ఖాతాలో పడ నున్నాయి.
దక్షిణ భారత్‌లోని ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానం చేసే విజయవాడ సమీపంలోని నంది గామ-ఇబ్రహీంపట్నం-విజయవాడ టోల్‌ప్రాజెక్ట్ ద్వారానూ అదానీ గ్రూప్‌నకు మంచి ఆదాయమే వస్తుందని భావిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16) ట్రాఫిక్‌కు ప్రధాన ఊతం. రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతి లభిస్తే వచ్చే నెలాఖరు కల్లా ఏపీ, గుజరాత్‌ల్లోని ఈ నాలుగు టోల్‌వేలు అదానీ గ్రూప్ చేతికి వస్తాయి.