అనూహ్య హత్య: షిండేని కలిసిన తండ్రి
posted on Jan 24, 2014 @ 4:41PM
ముంబై నగర శివార్లలో కాలిన శవమై లభించిన మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య తండ్రి ప్రసాద్ శుక్రవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేని కలిసి తమకు న్యాయం చేయాలని, దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కూతురిని వెతుకుతూ తాను అనుభవించిన మనోవేదన ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆయన షిండేతో అన్నారు. అనంతరం ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ జరిగిన దుర్ఘటన గురించి షిండేకు తెలిమజేశామని అన్నారు. కేసు విషయంలో పోలీసులు కూడా తమకు సహాయపడడంలేదని, తమ కుమార్తె అదృశ్యమైనప్పటి నుంచి ఆచుకీ కోసం స్వయంగా తామే గాలించామని, చివరికి పదిరోజుల తరువాత తను మృతదేహం లభించింది. మాకు కలిగిన ఈ బాధ మరే తల్లిదండ్రులకి రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.