అవినీతిలో ఏపీ నెంబర్ వన్!
posted on Mar 30, 2021 @ 4:04PM
ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో దేశంలో నెంబర్ వన్ స్టేట్. జగన్ రెడ్డి పాలనలో అప్పులు తీసుకోవడంలోనూ దేశంలో ఆంధ్రప్రదేశే టాప్. అప్పులు చేయడంలోనే కాదు అవినీతి, అక్రమాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ లో ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అవినీతి అక్రమాల్లో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రథమ స్థానంలో నిలిపారని చెప్పారు.
22 మంది ఎంపీలను పెట్టుకుని 22 నెలల్లో రాష్ట్రానికి జగన్ ఏం చేశారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని తిరుపతి ఉపఎన్నికలో ఓట్లు అడుతారు? అని నిలదీశారు. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు తమ గళాన్ని వినిపించ లేదన్నారు. వ్యక్తిగత విధ్వేషాలతో తనపై తప్పుడు కేసులు బనాయించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని అచ్చెన్నాయుడు చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో తెలుగు దేశం పార్టీ విజయం ఖాయమన్నారు అచ్చెన్నాయుడు.