బీజేపీ షార్ట్ ఫిలిం ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?
posted on Jul 9, 2016 @ 12:25PM
బీజేపీ నేతలు ఓ షార్ట్ ఫిలిం తీయనున్నారు. బీజేపీ నేతలేంటీ..? షార్ట్ ఫిలిం ఏంటీ అనుకుంటున్నారా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం. ఇంతకీ షార్టి ఫిలిం ఎందుకనుకుంటున్నారా.. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం ఏపీ ప్రజల్లో ఉందని తెలిసిందే. అయితే వారి కోపాన్ని తగ్గించడానికే బీజేపీ నేతలు ఈ షార్ట్ ఫిలిం ప్లాన్ వేశారంట. అసలు సంగతేంటో చూద్దాం..
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల ద్వారా ఇప్పటికే అర్దమైపోయింది. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ..ఇప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ప్రత్యేక హోదా కాదు కదా.. తగిన ఆర్దిక సాయం కూడా చేయట్లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం తాము ఏపీకి చాలా సాయం చేసేమన్నా ధోరణిలో ఉండటం ఆశ్చర్యం. దీనిలో భాగంగానే ఏపీ ప్రర్యటనలో ఉన్న జాతీయ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం తాము వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీకి మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. ఇది విన్న టీడీపీ నేతలు ఊరుకుంటారా.. ఏపీకి ఇస్తామన్న స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్‌కి బడ్జెట్‌లో నిధులు ఎక్కడ కేటాయించారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఇరుపార్టీ నేతల మధ్య మాటల యుద్దం జరిగింది.
దీంతో బీజేపీ నేతలంతా సమావేశమై.. ఏపీకి తాము ఏం చేయలేదన్న వాదనను తిప్పికొట్టాలన్న దానిపై చర్చకు దిగారు. దీనిపై బీజేపీ నేతలు ఎవరికి తోచిన సలహాలు వారు ఇచ్చారంట కూడా. అయితే ఆఖరికి ఏపీకి బీజేపీ ఏమి ఇచ్చిందో ఒక షార్ట్‌ఫిల్మ్ ద్వారా వివరిస్తే అప్పుడైతే జనం నమ్ముతారంటూ ఓ విన్నపం వచ్చిందట. అంతేకాదు ఈ విన్నపానికి బాగానే ఉందని చాలామంది ఓటేశారట కూడా. మరి బీజేపీ నేతలు షార్ట్ ఫిలిం ప్లాన్ వేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరుకుంటారా.. అసలే రాజకీయ చాణక్యుడు ఆయన. వారి ప్లాన్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబును దాటి మరి ఈ షార్ట్ ఫిలిం ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి. తీసినా జనానికి ఎంత వరకూ ఇంప్రెస్ చేస్తారో చూడాలి..