ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఏంటి..?
posted on May 13, 2016 @ 4:24PM
ఏపీ ప్రత్యేక హోదాపై ఇప్పటికే కేంద్రం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అది క్లియర్ కట్ గా అర్ధమయిపోయింది. ఇంకా దీనిపై బీజేపీ ఎంపీ ఇంఛార్జ్ సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. విభజన లేనందున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాద్యం కాదని తేల్చి చెప్పేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని.. అయినా ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి నిధులిస్తున్నాం.. ఇప్పటికే ఏపీకి రూ.లక్షా 75 వేల కోట్లు ఇచ్చాం.. ఇక ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని తిరిగి ప్రశ్నించారు.
ఇంకా మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కూడా మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని చెప్పేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని.. అందుకే ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామని కేంద్రం చెబుతోందని ఆమె చెప్పారు. ఇఫ్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉందని, కొత్తగా మరో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని ఆమె తేల్చిచెప్పారు.