రోను తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
posted on May 20, 2016 @ 11:05AM
రోను తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ 4 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలు వెళ్లాలని అధికారులు సూచించారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకూ 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇచ్ఛాపురంలో అత్యధికంగా 15.5, రణస్థలం 13.8 వర్షపాతం నమోదైంది. ఇక తుపాన్ కారణంగా పాపికొండ వెళ్లవలసిన పర్యాటక బోటులు నిలిచిపోయాయి. పట్టిసీమ, పురుషోత్తమపట్నం గ్రామాల వద్ద గోదావరి ఒడ్డున పర్యాటక బోట్లు నిలిచిపోయాయి.