బ్యాలెట్ పేపర్లు కాదు .. కత్తులు..?
posted on Feb 9, 2021 @ 10:43AM
తొలిదశ పంచాయితీ ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి . ఇరు వర్గాల ఘర్షణల మధ్యన ఏపీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇరు వర్గాల పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అంటూ ఘర్షణలకు దిగుతున్నారు.. ఎన్నికలు జరుగుతున్నాయా.. ? ఫ్యాక్షన్ పోరు జరుగుతున్నదా అంటుగావున్నాయి.. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లకు బదులు కత్తులు కనిపిస్తుండండం ప్రజలను భయాందోళను గురిచేస్తుంది.. అధికార పార్టీ వాళ్ళు ఇతర అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఇటు పోలీసులకు, అటు ఎన్నికల కమిషనర్ కి ఎన్ని ఫిర్యాదులు చేసినా .. వారి ఆగడాలు తగ్గకపోవడంతో పాటు రోజురోజుకి పెరుగుతున్నాయి..
కాకినాడలో పంచాయితీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలు, టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలకు కేంద్రంగా మారుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పరస్పరం కత్తులతో దాడులు జరుపుకోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.
విజయవాడలో జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని. పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేశామని. పోలింగ్ కేంద్రాల దగ్గర 100 మీటర్ల మేరకు రెడ్‌జోన్‌గా పోలీసులు ప్రకటించారు.