ఏపీకి కేంద్ర ప్రభుత్వ నిధులు.. ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి..!
posted on Aug 18, 2016 @ 3:08PM
రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటి పోయింది. ఇక విడిపోయిన రెండు రాష్ట్రాల్లో తెలంగాణ మిగులు బడ్డెట్ తో ఉండగా ఏపీకి మాత్రం ఆర్ధికలోటు మిగిలింది. అప్పటి నుండి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నిధులు కేటాయించమని అడుగుతూనే ఉంది. అయితే మొదట్లో కొంత మొత్తంలో నిధులు కేటాయించింది. కానీ అవి కూడా నామమాత్రంగానే కేటాయించింది. కానీ ఈమధ్య ప్రత్యేక హోదా గురించి సభలో పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వ చెప్పకనే చెబుతోంది. ప్రత్యేక ప్యాకేజీ అయితే ఎంత కావాలంటే అంత ఇస్తాం కానీ.. హోదా మాత్రం ఇచ్చేది లేదని చెబుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా ఒకే తాటిపైకి వచ్చి ప్రత్యేకహోదాపై ఆందోళన చేపట్టారు.
అందుకే ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం తప్పటడుగు వేసినా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గమనించిన కేంద్రం... ఏపీ సర్కారును ప్రసన్నం చేసుకునేందుకు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీకి వివిధ పద్దుల కింద నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక సాయం ప్రకటించింది. మొత్తం 1976 కోట్లలో..ఏపీకి ఉన్న ఆర్దిక లోటు కింద రూ 1,176 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి రూ. 350 కోట్ల.. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు విడుదల చేసింది. మరి కేంద్రం వేసిన ప్లాన్ వర్కవుట్ అవుద్దా.. దీంతో ప్రత్యేక హోదా గురించి అందరూ మరిచిపోతారా... లేకా హోదాపై ఇంకా డిమాండ్ చేస్తారా..? చూద్దాం.