160 మద్యం షాపులకు నో అప్లికేషన్
posted on Jun 26, 2012 @ 5:46PM
ఇది ఓ గమ్మత్తు అయిన విషయం. రాష్ట్రంలో కోలాహలంగా మద్యం దుకాణాల లక్కీడీప్ కేటాయింపుల కోసం పోటీ పడుతున్నారు. అయితే 160 మద్యం దుకాణాలకు మాత్రం ఒక్క అప్లికేషను కూడా దాఖలు కాలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా 6564 దుకాణాలకు 30వేలకు పైచిలుకు ధరఖాస్తులొచ్చాయి. ఈసారి పురుషులతో సమానంగా మహిళలూ పోటీపడి మరీ ధరఖాస్తు చేశారు. ఇఎండి కింద ఎక్సయిజ్ ఖజానాకు 75కోట్ల రూపాయలు చేరింది. గతేడాదితో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ.
గ్రేటర్‌హైదరాబాద్‌లో 379దుకాణాలుంటే వాటికి 470ధరఖాస్తులు వచ్చాయి. వీటిలో 70 షాపులకు మాత్రం ఒక్క ధరఖాస్తు కూడా అందలేదు. ఈ షాపుకు రూ.1.04కోట్లు లైసెన్స్ ఫీజు. అలానే గుంటూరు జిల్లాలో 20షాపులకు, కడప జిల్లాలో 70 నుంచి 80షాపులకు కూడా ధరఖాస్తు రాలేదు. అలానే తమ భార్యల చేత్తో ఇఎండి కట్టించటం లక్కు కలిసి వస్తుందని భావించి కొందరు మహిళలను తోడు తీసుకువచ్చారు. చిన్నచిన్న కాంట్రాక్టులు చేసేవారు, కొత్తగా ఈ వ్యాపారంలో దిగాలనుకున్న వారు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 555 దుకాణాలకు 2178 ధరఖాస్తులు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 473షాపులకు 3243 ధరఖాస్తులు, విశాఖలో 406షాపులకు రెండువేలు, నల్గొండలో 241షాపులకు 3149, వరంగల్ 231షాపులకు 3000, శ్రీకాకుళం 232షాపులకు 1900, విజయనగరం 202షాపులకు 2000, ప్రకాశం 321షాపులకు 3000, ఖమ్మం 151షాపులకు 2371,కర్నూలు 194షాపులకు 620, గుంటూరు జిల్లాలో 342కు 4000, కడప జిల్లాలో 269షాపులకు 1500, నిజామాబాద్‌జిల్లాలో 142 షాపులకు 1500, నెల్లూరు 348షాపులకు 3000, అనంతపురం జిల్లాలో 236షాపులకు 2000, చిత్తూరు జిల్లాలో 458షాపులకు 1500, కృష్ణాజిల్లాలో 335షాపులకు 3000, గ్రేటర్‌హైదరాబాద్ 379షాపులకు 470, రంగారెడ్డి జిల్లాలో 390షాపులకు 700, మెదక్ 165షాపులకు 1300 ధరఖాస్తులు వచ్చాయి.