తెలిసినా తప్పని ఎన్నికల భారం?
posted on Jul 6, 2012 @ 10:04AM
అన్నీ తెలిసినవారే ప్రచారం చేస్తే లోకమంతా దాన్ని అనుసరిస్తుంది...మేథావులు ఎలా చెబితే అలా వారి బాటలోనే ప్రజలు నడుస్తారు. శాసనకర్తలను అనుసరించక తప్పనిస్థితి ఓటర్లది...ఇలా ఎన్ని వాక్యాలు రాసినా ఎన్నికల గురించి ఇంకా రాయటానికి ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. ఇంత సోదంతా ఎన్నికల కోసమే అనుకుంటే దాని భారం మోపుతున్న ప్రజాప్రతినిథుల గురించి కూడాను. స్వేచ్ఛ పేరు చెప్పి ఐదేళ్లు పాలించాల్సిన శాసనసభ్యుడు రెండేళ్ల తరువాత పార్టీ మారినా ఏమీ చేయలేని దైన్యస్థితిలో ఓటర్లుంటున్నారు. దీని ఫలితంగా మళ్లీ ఎన్నికలు మరోప్రతినిధి ఎంపిక. ప్రభుత్వానికి ఎన్నికల్లోనే వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతోంది. ఈ విషయాన్ని పాలకులు గమనించలేదా? అందరికీ తెలుసు అయినా మౌనం వహించటమే వారి గొప్పదనం. ఈ విషయంపై ఎవరూ పెద్దగా స్పందించలేదు కూడా. అయితే దీన్ని భరించలేక గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు పార్లమెంటు నైతిక ప్రవర్తనా నియమావళి కమిటీకి ఒక లేఖరాశారు. దాని సారాంశం ఏమిటంటే ఒకసారి రాజీనామా చేసిన ప్రతినిథిని రెండు ఎన్నికలకు పోటీ నుంచి తప్పించాలి అని రాయపాటి కోరారు.