దైవకణం గురించి మనమే ముందు కనుక్కున్నామా?
posted on Jul 6, 2012 @ 10:19AM
భారతీయ పురాణాలు దైవశక్తిని చాటుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తూ ‘‘అణువు కన్నా చిన్నదైన పరమాణువు దాని కన్నా చిన్నదానికీ మూలం తానే’’ అని పరోక్షంగా దైవకణం గురించి ప్రస్తావించారు. అలానే 32 ఏళ్ల పాటు దకోలార్‌గోల్డ్‌ఫీల్డ్స్‌లో దైవకణం గురించి పరిశోధనలు చేశారు. కర్నాటక రాష్ట్రంలోని కోలార్ బంగారుగనుల్లో ఈ పరిశోథనాకేంద్రం నడిచింది. 1960 నుంచి 1992 వరకూ ఇక్కడ పరిశోధనలు జరిగాయి. గనుల అంతర్భాగంలో సుమారు రెండు కిలోమీటర్ల లోతున పరిశోథనా కేంద్రం ఉంది. ఇక్కడ న్యూట్రినోలపై విశ్లేషణ సాగించారు. కాస్మిక్‌కిరణాలు భూ అంతర్భాగంలో నశించి వేలాది కోట్ల న్యూట్రినోలు ఉత్పత్తి అవుతాయని పరిశోథకులు గుర్తించారు.
ఇటీవల తాజాగా 2100మంది సెర్న్ శాస్త్రవేత్తల బృందం ‘హిగ్సిబోసన్’ పేరిట దైవకణం ఉందని నిగ్గు తేల్చారు. బ్రిటన్ శాస్రవేత్త హిగ్స్, భారతీయశాస్త్రవేత్త సత్యేంధ్రనాథ్‌బోస్ రెండు పేర్లు కలిపి ఆ కణానికి పెట్టారు. అయితే ఈ పరిశోథనకు ముందుగా జరిగిన కోలార్ గనుల్లో పరిశోధనలోనూ న్యూట్రినోలకు మూలం ఉందని గమనించారు. ఇదే కాకుండా ఆథ్యాత్మిక బాటలో నడిచే ప్రముఖులు కొన్ని ప్రాంతాల్లో చూసిన కాంతిపుంజాలను దైవాంశగా భావిస్తారు. మానససరోవర్ వెళ్లిన యాత్రికులకు ఈ కాంతిపుంజమే దారి చూపుతుందని నమ్మకం. అదీ దైవకణాలతో మిళితమైనదని సాధువులు చెబుతుంటారు. చారిత్రకనేపథ్యంతో ఉన్న ఏకైకజాతి భారతజాతి, దీని పుట్టుక కొన్ని వేల యుగాల క్రితమే జరిగిందని భావిస్తుంటారు.