రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ ముఖ్యంశాలు
posted on Mar 18, 2013 @ 2:49PM
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రూ. 25,962 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రణాళిక వ్యయం రూ.17,694 కోట్లు, ప్రణాళేకతర వ్యయం రూ.8,267 గా ఉంది. వ్యవసాయ రుణ లక్ష్యం రూ.75,450 కోట్లుగా మంత్రి కన్నా వివరించారు. ప్రకృతి వైపరిత్యాలలో నష్ట పరిహారం కింద రూ.589 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మద్దతు లభించని సమయంలో రైతులకు సాయం కోసం రూ.100 కోట్లతో ఆలంబన నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
వ్యవసాయం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు :
- విద్యుత్ రాయితీ కోసం - రూ.3,621 కోట్లు
- షుగర్ ఫ్యాక్టరీ - రూ.52.05 కోట్లు
- ఫుడ్ ప్రాసెసింగ్ - రూ.120 కోట్లు
- వడ్డీలేని పంట రుణాలకు రైతుశ్రీ పథకం పురుతో రూ. 500 కోట్లు
- వ్యవసాయ యంత్రీకరణ - రూ.450 కోట్లు
- పట్టు పరిశ్రమలకు - రూ.79.20 కోట్లు
- రాష్ట్రంలో కొత్తగా ఆరు రైతు బజార్ల ఏర్పాటు
- మత్స్యశాఖ - రూ.184.35 కోట్లు
- ఆహార ధాన్యాల నిల్వలకు - రూ.39 కోట్లు
- విత్తనాభివృద్ధి - రూ.308 కోట్లు
- భూసార అభివృద్ధి నిర్వహణకు - రూ.2309 కోట్లు
- అటవీశాఖ - రూ.492 కోట్లు
- పశుసంవర ్థక శాఖ - రూ.924 కోట్లు
- సోలార్ పంపు సెట్లకు - రూ.150 కోట్లు
- వర్షాధారిత వ్యవసాయాభివృద్ధికి - రూ.2903 కోట్లు
- గోదాముల నిర్వహణకు - రూ.42 కోట్లు
- రైతులకు 50 శతం సబ్సీడీ విత్తనాలు