వెబ్‌సైట్‌లో బిసీ సంక్షేమం
posted on Jun 26, 2012 @ 6:25PM
రాష్ట్రంలో బిసీ సంక్షేమ కార్యక్రమాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. బిసీల సంక్షేమానికి అవసరమైతే బడ్జెట్ పెంచుతామని సిఎం హామీ ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు చెందిన అన్ని కులాలకు కలిపి స్టడీసర్కిల్స్ జిల్లాల వారీగా నెలకొల్పుతామన్నారు. ఈ స్టడీసర్కిల్స్ వల్ల భవిష్యత్తులో కాంపీటేటీవ్ పరీక్షల్లో బిసి విద్యార్థులు మంచిమార్కులు సంపాదించి ఉద్యోగావకాశు పెంపొందించుకోవచ్చు.
అటు ఉద్యోగంతో పాటు కొత్తగా వచ్చిన పథకాలు, ప్రభుత్వ ఇతర కార్యక్రమాలు ముందుగానే వారికి అర్థమయ్యేలా స్టడీసర్కిల్‌లో వివరిస్తారు. వెనుకబడిన విద్యార్థుల్లో స్టడీసర్కిల్ ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయమని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం చెప్పకపోయినా స్టడీసర్కిల్స్ నడుస్తున్నాయి. బిఇడి చదివిన వారి కోసం ఈ సర్కిల్స్‌ను నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాల్లో ఈ సర్కిల్స్ స్వచ్ఛందంగా ఎటువంటి రుసుం లేకుండా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బిసి ఉద్యోగుల్లో కొందరు స్టడీసర్కిల్‌లో చేరేందుకు ముందుగానే సిద్ధంగా ఉన్నారు.