యూపీలో మరో శ్రద్ధా వాకర్
posted on Nov 21, 2022 @ 11:17AM
సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసిన ఉదంతం మరువక ముందే అటువంటిదే మరో సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అఫ్తాబ్ అనే లివ్ ఇన్ పార్టనర్ అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్ లో ఓవ్యక్తి తన ప్రేయసిని దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేసి బావిలో పడేశారు.
తలను మాత్రంవిడిగా మరో చెరువులో ఈ ఘటన యూపీలోని అజంగఢ్ జిల్లా పశ్చిమిగ్రామంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్ తనను ప్రేమించి దగ్గరైన యువతి మరో పెళ్లి చేసుకోవడంతో పగ పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురు చూసి తన తమ్ముడితో కలిసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. ప్రిన్స్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
ప్రశ్నించే క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ క్రమంలో అతడి కాలికి గాయమైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య తరహాలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఢిల్లీలో శ్రద్ధ వాకర్ ను ఆమె పార్టనర్ అఫ్తాబ్ దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 35 భాగాలు చేసిన విషయం తెలిసిందే!