విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం
posted on Dec 1, 2023 9:08AM
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో వరుస అగ్రిప్రమాదాల పట్ల తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో 40 బోట్లు అగ్నికి ఆహుతైన ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో గురువారం సంభవించిన అగ్ని ప్రమాదంలో రూ.20లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. హార్బర్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఇటీవల అగ్నిప్రమాదం జరిగి బోట్లు కాలి బూడదైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన రోజుల వ్యవధిలోనే మరో అగ్నిప్రమాదం జరగడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.
.ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీల నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. షార్ట్ సార్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు 'ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో వరుస అగ్నిప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా దాదాపు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.