మరో చీతా మృతి
posted on Apr 24, 2023 @ 2:01PM
దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒక మగ చీతా మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో అనారోగ్యంతో మరణించింది. దీంతో విదేశాల నుంచి రప్పించిన చీతల్లో మరణించిన వాటి సంఖ్య రెండుకు చేరుకుంది. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ చీఫ్ కన్సెర్వేటర్ జేఎస్ చౌహన్ నిర్ధారించా రు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్ అనే చీతా కునో జాతీయ పార్కులో అనారోగ్యం పాలై, చికిత్స పొందుతూ మరణించింది. మరణం వెనుక కారణాన్ని కనుగొనాల్సి ఉంది. చీతా అనారోగ్యంపాలైన సంగతిని అటవీ సిబ్బంది ఆదివారం (ఏప్రిల్ 23) గుర్తించారు. వెంటనే దానికి మత్తు మందు ఇచ్చి, వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చీతా మరణించింది.
వెటర్నరీ వైద్యుల బృందం చీతా దేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోస్ట్ మార్టంను వీడియో తో పాటుగా ఫొటోలు కూడా తీస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి కునో జాతీయ పార్కుకు ఉదయ్ తో పాటుగా మరో 11 చీతాలను తీసుకొనివచ్చారు. మొత్తంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చిత్రాలను తీసుకొనివచ్చారు.
గతేడాది నమీబియా నుంచి పార్కునకు తీసుకువచ్చిన ఎనిమిది చీతాల్లో శషా అనే చీతా ఈ ఏడాది మార్చిలో మరణించింది. ఇప్పుడు రెండవ చీతా రెండు చితాలు మరణించినట్లైంది. అంటే దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన 20 చీతాల్లో రెండు మరణించగా వాటి సంఖ్య ఇప్పుడు 18కి పడిపోయింది.
ప్రధాని మోడి చేతుల మీదుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తెచ్చి, పార్కుల్లో వదిలితే.. ఇలా ఒక్కోక్క చీతా మృత్యవాత పడటంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటి ఆరోగ్య రక్షణ కోసం మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.