వరద ప్రాంతాల్లో వాయిదా
posted on Jul 22, 2013 @ 11:59AM
రేపు జరగనున్న పంచాయతీ ఎలక్షన్స్ పై కూడా వరుణుడు ప్రతాపం చూపించాడు.. పలు జిల్లాల్లో భారీ గా కురుస్తున్న వర్షాలతో అక్కడ ఎన్నిక నిర్వహించడం కష్టం అని తేల్చేసింది ఎలక్షన్ కమీషన్.. దాదాపు ఆరు జిల్లాల్లోని 300లకు పైగా గ్రామల్లో పంచాయితీ ఎలక్షన్స్ వాయిదా పడనున్నాయి..
వర్షాలు అధికంగా ఉన్న ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని అన్ని డివిజన్‌లలో ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి.. ఈ ఎలక్షన్స్ ను ఆఖరి విడత డివిజన్‌లతో పాటు ఈ నెల 31న జరపటానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. ఖమ్మంతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి సౌకర్యాలు కూడా సరిగా లేకపోవటంతో ఎలక్షన్స్ వాయిదా వేస్తున్నట్టుగా ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ ప్రకటించారు.