ఉలిక్కిపడ్డ అనంతపురం.. జంట హత్యల కలకలం..
posted on Jul 21, 2016 @ 4:44PM
అనంతపురంలో జంట హత్యలు కలకలం రేపతున్నాయి. జిల్లాలో మరోసారి పాతకక్ష్యలు భగ్గుమన్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా, రుద్రంపేట కూడలిలో చంద్రబాబు నగర్‌లో ఇద్దరు వ్యక్తులను వేట కొడవళ్లతో నరికి చంపారు. వీరు పరిటాల రవీంద్ర వర్గీయులైన పాత రౌడీషీటర్లు గోపినాయక్, వెంకటేశ్ నాయక్‌గా గుర్తించారు. వీరిద్దరికీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులతో గత కొంతకాలంగా విభేధాలున్నాయని.. ఈ కారణంగానే ఆటోలో కూర్చొని ఉన్న గోపి నాయక్, వెంకటేశ్ నాయక్‌లపై ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారు వేటకొడవళ్లతో దాడి చేశారని.. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారని చెబుతున్నరు. అయితే వీరిపై దాడి జరగడం ఇదేం మొదటిసారి కాదని.. ఇంతకుముందు ఓ నాలుగు సార్లు వీరిపై హత్యాయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇన్నిరోజులు కాస్త ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో ఒక్కసారే రెండు హత్యలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.