కేటీఆర్ పుట్టినరోజుకు డైరెక్టర్ బందూక్ లక్ష్మణ్ వినూత్న కానుక
posted on Jul 24, 2020 @ 9:42AM
తెలంగాణ రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా బందూక్ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వినూత్న బహుమతి సిద్ధం చేశారు. కెటీఆర్ జన్మదినమైన 24.07.76 రోజుతో కూడిన కరెన్షీ నోట్లని సేకరించి ఈ 2020 జూలై 24న కేటీఆర్ 44వ పుట్టినరోజున అందజేస్తున్నట్టు తెలిపారు. రూపాయి నోటు, ఐదురూపాయల నోటు, పదిరూపాయలనోటు, ఇరవైరూపాయల నోటు, యాబై రూపాయల నోటు, వంద రూపాయలు అలాగే రెండువందల రూపాయల నోట్ల వరకూ 24.07.76 ఒకే నంబర్ గల నోట్లని సేకరించారు. దీంతో పాటు కేటీఆర్ చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఫొటోలను సేకరించి వాటిని చింతమడకలోని కేసీఆర్ ఇంటి బ్యాగ్రౌండ్తో అందమైన పోటో ఫ్రేముగా చేసారు. ఈ అరుదైన కానుకని కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందజేస్తున్నారు.