ఆమ్నీషియాపబ్ కేసు...మైనర్లను మేజర్లుగా పరిగణించండి పోలీసుల పిటిషన్
posted on Sep 2, 2022 @ 7:52PM
జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరి గణించాలంటూ నాంపల్లి కోర్టు లో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురికి మెచ్యూరిటీ లెవల్స్ ఉన్నాయని, మేజర్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఐదుగురికి ఉన్నాయని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల పిటిషన్‌పై త్వరలో కోర్టు విచారణ చేపట్టనుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వచ్చిన మైనర్ బాలి కపై సాదుద్దీన్ అనే యువకుడితోపాటు నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. మరో మైనర్ బాలిక పట్ల అసభ్యం గా ప్రవర్తించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుల్లో చాలామందికి రాజకీయ కుటుం బ నేపథ్యం ఉండ టంతో కేసు సంచలనంగా మారింది. నలుగురు మైనర్లు కావడంతో.. పోలీసులు ముందు నుంచి సాదుద్దీన్‌నే ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. మిగతా మైనర్ నిందితుల్లో ఓ ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల కుమారు లున్నారు.
వీవీఐపీల పిల్లలు నిందితులుగా ఉండడం.. ఈ ఘటనపై విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకు న్నారు. మైనర్లకు కూడా పెద్ద శిక్షలు పడేలా పకడ్బందీగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. రిమాం డ్ రిపోర్టులో ఇప్పటికే 12 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్న పోలీసులు వారి పేర్లను, వివరాలను కోర్టుకు అందజేశారు. వారిలో బాలిక తల్లి దండ్రులు, సోదరుడు, బాలికను పబ్‌కు తీసుకెళ్లిన వ్యక్తి, పబ్ నిర్వాహకుల్లో ఇద్దరు, ఓ బౌన్సర్, ఓ కాపలాదారు, బేకరీలో పని చేసే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
కేసుకు మరింత బలం చేకూరేలా పబ్‌లో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వారు.. నిందితులతో సన్నిహితంగా మెలిగినవారిని కూడా సాక్ష్యులుగా చేర్చాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలికపై అత్యాచా రానికి ఉపయోగించిన ఇన్నోవా వాహనంలో లభించిన తల వెంట్రుకలను పోలీసులు సేకరించారు.