కన్నా కు అర్దరాత్రి గుండెపోటు వస్తుంది. తెల్లారేసరికి పోతుంది!
posted on Apr 21, 2020 @ 9:32PM
* బీ జె పీ రాష్ట్ర అధ్యక్షుడిపై అంబటి రాంబాబు ఫైర్
* కాణిపాకం వినాయకుడి ముందు ఐదు ప్రమాణాలు చేస్తారా, అంటూ సవాల్
పాలక వై ఎస్ ఆర్ సి పి ఫైనల్ గా పార్టీ ఎంఎల్ ఏ అంబటి రాంబాబు ను తెర మీదకు తీసుకు వచ్చేసింది. కన్నా, సుజనా చౌదరి ల దాడి కి ప్రతి దాడి ప్రతి దాడి మొదలెట్టింది. ప్రతిపక్షనేత చంద్రబాబు రెండురోజులకొకసారి లేదా రోజూ యాప్ ద్వారా వచ్చి సూక్తిముక్తావళి చెబుతున్నారంటూ- చంద్రబాబు ను తన స్టైల్ లో రఫ్ ఆడేశారు. " టెస్టింగ్ కిట్స్ సౌత్ కొరియానుంచి తెప్పిస్తే దానిలో కమీషన్ కొట్టేశామంట...కక్కుర్తిపడి కోట్ల రూపాయలు కాజేశామని చంద్రబాబు మాట్లాడతారు.దానికంటే ముందు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణగారు ట్వీట్ చేస్తారు. ఎందుకు ట్వీట్ పెట్టారని అడిగితే నేను డౌట్ వచ్చి క్లారిఫికేషన్ కోసం పెడితే గుమ్మడికాయల దొంగఎవరంటే భుజాలు తడుముకుంటున్నారని కన్నాలక్ష్మీనారాయణగారు మాట్లాడుతున్నారు. గుమ్మడికాయలదొంగ ఎవరంటే భుజాలు మేం తడుముకున్నామా...అని అడుగుతున్నాను....కరోనా కిట్లలో కూడా కమీషన్ కొడతారా అంటారా....అది సమాచారం కోసం అడిగారా...లేదా మీ ట్వీటా...ఇదేం ధోరణి. దీనిపై విజయసాయిరెడ్డిగారు కూడా చాలా వివరంగా చెప్పారు.మీరు బిజేపి రాష్ర్ట అధ్యక్షుడుగా ఉండి టిడిపికి 20 కోట్లకు అమ్ముడుపోయారు...దానిపై ఆధారాలు ఉన్నాయి...అని చెబితే కన్నాగారు విరుచుకుపడిపోయారు...ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి...నన్ను కొనేవాడు ఎవరూ లేరు ఈ రాష్ట్రంలో ....నీతి,నిజాయితీకి నిప్పులాంటివాడ్నినేను అని ప్రగల్భాలు పలికారు. కన్నాలక్ష్మీనారాయణగారు...మీరు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అయ్యారు.బిజేపిలో పుట్టి,బిజేపిలో పెరిగి,ఆర్ ఎస్ ఎస్ లో పనిచేసి బిజేపి సిధ్దాంతాలన్ని మీరు ఆకళింపు చేసుకుని అధ్యక్షులయ్యారా...లేక హఠాత్తుగా అధ్యక్షులయ్యారా....మీరు కాంగ్రెస్ పార్టీలో పుట్టారు..అక్కడే పెరిగారు...మంత్రిగా చేశారు...కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల వల్ల ఎదిగినమీరు...ఆ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోతే దానిని వదిలివేసి బిజేపిలోకి జంప్ అయ్యారు.మీకు బిజెపి అధ్యక్షపదవి ఇవ్వకపోతే అలిగారు.అలిగి ఏం చేశారు మరిచిపోయారా," అంటూ అంబటి రాంబాబు కన్నా పై విరుచుకు పడ్డారు.
ఈరోజు ప్రాంతీయపార్టీలు గురించి ఆయన మాట్లాడుతూ అవన్ని కులం,కుటుంబం,అవినీతి,మతంతో అవినీతి అయ్యాయని అంటూ జాతీయపార్టీలు బాగుంటాయని చెబుతున్నారు.మరి మీరు జాతీయపార్టీనుంచి ప్రాంతీయపార్టీలోకి ఎలా రావాలనుకున్నారో సమాధానం చెప్పండి. మీరు జగన్ గారివద్దకు వెళ్లి, వైయస్సార్ కాంగ్రెస్ లోకి రావాలనుకుని 2018 ఏప్రిల్ 25 వతేదీన ముహుర్తం పెట్టుకున్నమాట వాస్తవమా.... కాదా ,బిజేపి అధ్యక్షపదవి ఇవ్వకపోతే అలిగి బేరసారాలు ఆడుకున్నమాట వాస్తవమా... కాదా.....ఇదేనా మీ నైతికత...చేరాలనుకున్నారు చేరారా.....చేరలేదు...ఆఫర్ వస్తే మానుకున్నారు.దానిలోనే ఉన్నారు....అధ్యక్షులయ్యారు.
ఏప్రిల్ 24,2018 వతేదీ అర్దరాత్రి మీకు చమటలు పట్టాయి.తీవ్రఅస్వస్ధతకు గురయ్యారు.లలితాసూపర్ స్పెషాలిటి ఆస్పత్రిలో చేరారు.ఎందుకు చేరారు.ఆఫర్ కోసం గుండెపోటు తెప్పించుకున్న కన్నాలక్ష్మీనారాయణ మాకు నీతులు వల్లెవేస్తారా...బిజేపి అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్దాయి మీకు ఎక్కడిది అని అడుగుతున్నాను.అర్దరాత్రి గుండెపోటు వస్తుంది.తెల్లారేసరికి పోతుంది.టిడిపితో కూడా బేరాలు ఆడతారు.తిరిగి బిజేపిలో ఉండి అధ్యక్షులవుతారు.
మీరు అన్నారు నిన్న....విజయసాయిరెడ్డిగారిని అడిగారు...కాణిపాకంలో వినాయకుడు ముందు ప్రతిజ్ఞ ప్రమాణం చేస్తారా అని..ఎస్... మేం చేస్తామని అడుగుతున్నాను.నీవు 20 కోట్లకు అమ్ముడుపోయావు.చంద్రబాబు మనిషివి.చీడవి అని ప్రమాణం చేయడానికి సిధ్దంగా ఉన్నాం. ఆరోజు నాకు నిజంగానే గుండెపోటు వచ్చిందని ప్రమాణం చేస్తారా....అంతేకాదు....మీ సంగతి చాలా ఉంది.కన్నాగారు...వైయస్ రాజశేఖరరెడ్డిగారు మరణించిన తర్వాత రోశయ్యగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.రోశయ్యగారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిగారు సిఎం అయ్యారు.ఆయన మారతారనే టాక్ వచ్చింది. అప్పుడు మీరు ఢిల్లీ వెళ్లి 20 కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో సిఎం పదవి కొనుక్కోవాలనే ప్రయత్నం చేశారా లేదా....20 కోట్లు లంచం ఇచ్చారు ఒకాయనకు...ఆయన టోపి పెట్టారు అది వేరే విషయం.అది పత్రికలలో రాకపోయినా జగమెరిగిన సత్యం. 20 కోట్ల రూపాయలు ఇచ్చి సిఎం పదవి కొనుక్కోవాలనుకునే నీవా నైతికత గురించి మాట్లాడేది.అలా ముఖ్యమంత్రి అయ్యి రాష్ర్టాన్ని ఏం చేద్దామనుకున్నావు. దీనికి కూడా సిధ్దంగా ఉన్నావా...కాణిపాకం వచ్చి వినాయకుడి చెంతన కాంగ్రెస్ పార్టీలో సిఎం పదవి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయలేదని ప్రమాణం చేయడానికి సిధ్దంగా ఉన్నావా...
బిజేపిలో చాలామంది అధ్యక్షపదవికి పోటీ పడినా మీరు ఎలా అధ్యక్షుడు అయ్యారు.ఇటీవల ఎన్నికలలో బిజేపి పంపిన పార్టీ ఫండ్ కొట్టేశావా... లేదా...లెక్క చెప్పకుండా తప్పించుకు తిరుగున్నావా... లేదా...అధిష్టానం కోపం గా ఉందని చెప్పి జగన్ గారిపై దూకుడుగా వెళ్తే ఏదో జరుగుతుంది.నీకుి చంద్రబాబు కాపాడతాడనే ఉద్దేశ్యంతో చంద్రబాబుకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు.
బిజేపిలో ఉన్న కన్నా,సుజనాచౌదరి టిడిపి కోవర్టులు.ఇది దయచేసి బిజేపినేతలు తెలుసుకోమని చెబుతున్నాను.బిజేపి రాష్ట్ర శాఖని అమ్మేస్తారు.ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసే మనస్తత్వం కలిగిన కన్నాగారు విజయసాయిరెడ్డిగారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు.
సూట్ కేసు కంపెనీలు పెట్టారంట...16 మాసాలు జైలులో ఉన్నారంట...ఇది అందరికి తెలిసిన తర్వాతే జగన్ గారికి ప్రజలు ఓట్లు వేసి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు. కన్నాగారు...మీరు పార్లమెంట్ కు నిలబడితే ఎన్ని ఓట్లు వచ్చాయి.ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారు.ఖర్చు పెట్టకుండా నొక్కేశారు.డిపాజిట్లుకూడా రాని దౌర్భాగ్యపరిస్దితులలో ఉండి మీరు మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కన్నాగారికి చెబుతున్నాను...మీరు సిధ్దంగా ఉన్నారా...విజయసాయిరెడ్డిగారు...మేం....కాణిపాకం వస్తాం...వినాయకుడి ఆలయంలో ప్రమాణం చేస్తాం...చేయడానికి మీరు సిధ్దంగా ఉన్నారా లేదా సమాధానం చెప్పండి. సిధ్దంగా ఉంటే..టైం ,డేట్ చెప్పండి.మీరు చెబితే రావడానికి మేం సిధ్దంగా ఉన్నాం.గుర్తుపెట్టుకోండి.
మొత్తం ఐదు ప్రమాణాలు
1.ఏప్రిల్ 24 వతేదీన నాకు గుండెపోటు వచ్చి నేను ఆస్పత్రిలో చేరాను అని ప్రమాణం చేయాలి.
2.కాంగ్రెస్ పార్టీలో సిఎం అవ్వడానికి నేను 20 కోట్లు ఇవ్వలేదని ప్రమాణం చేయాలి.
3.బిజేపి అధ్యక్షుడుగా ఎన్నికలలో నాకు ఇచ్చిన ఫండ్ ను సద్వినియోగం చేశాను అని ప్రమాణం చేయాలి.
4.చిన్నస్దాయిలో ఉన్ననేను ఇన్ని వందల కోట్లకు అధిపతి కావడానికి సొంతంగా కష్టపడి సంపాదించాను తప్ప రాజకీయ అవినీతి చేయలేదు అని ప్రమాణం చేయాలి.
5.చంద్రబాబుకు అమ్ముడు పోలేదు అని ప్రమాణం చేయాలి.
ఈ ఐదు ప్రమాణాలు చేయడానికి మీరు సిధ్దపడండి.డేట్ ,టైమ్ చెప్పండి. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఈ ఐదింటికి సమాధానం చెప్పి మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెట్టి నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప ఏవేవో పిచ్చి మాటలు ఒళ్లు దగ్గర పెట్టుకోండి...అధికారమదంతో మీరు విర్రవీగుతున్నారు.మర్యాదగా మాట్లాడండి ...ఇలాంటి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడవద్దు. అదేమంటే అంటున్నారు...పరువునష్టం దావా వేస్తా అంటున్నారు...వేయండి.మీరు చాలామందిపై వేశారు....అలా వేసి గుంటూరులో కోర్టుకు తిరుగుతున్నారు.అలాంటి దావాలు వేసి కూడా డబ్బులు సంపాదించాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి మీరు. చంద్రబాబు,మీరు కలసి ఏదోవిధంగా జగన్ గారి ప్రభుత్వంపై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన పద్దతి కాదు. మేం ఈ రాపిడ్ కిట్స్ కొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా తప్పుచేయలేదు. కేంద్రప్రభుత్వం 795 రూపాయలకు కిట్ కొన్నది.దీనిని మీరు ఎందుకు ప్రశ్నించరు అంటే విజయసాయిరెడ్డిగారిని పార్లమెంట్ లో అడగమనండి అంటున్నారు.పక్కనే ఉన్న కర్నాటక ప్రభుత్వం కూడా 795 రూపాయలకు కిట్ కొన్నది. ఐసిఎంఆర్,కర్నాటక ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువధరకు కొన్నాయని చంద్రబాబును అడిగితే అదేమన్నా ఎక్స్యుక్యూజా అంటున్నారు...అంటే పక్క రాష్ట్రాన్ని గాని,కేంద్ర ప్రభుత్వాన్ని గాని అడిగే దమ్ము లేదా, అంటూ రాంబాబు , కన్నా లక్ష్మీనారాయణ పై విరుచుకుపడ్డారు.
విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కన్నాగారు ఎన్నికలలో డిపాజిట్ తెచ్చుకుంటే పదిలక్షలు ఇస్తామని టిడిపి చెప్పింది.ఇప్పుడు పదిలక్షలు కాదు 20 కోట్లు ఇచ్చారు.కన్నాగారు ఢిల్లీలో పొగొట్టుకున్న 20కోట్లు సుజనా చౌదరి ద్వారా ఢిల్లీలోనే సంపాదించారు.లోటు పూడ్చుకున్నారు.గతంలో కాంగ్రె్స్ పార్టీలో బ్రోకర్ కు ఇచ్చి పొగొట్టుకున్నారు.నేడు బ్రోకర్ గా ఉన్న సుజనా చౌదరి ద్వారా సరిచేసుకున్నారు. సత్తెనపల్లిలో యువకుడు మరణించారు.అది చాలా భాధాకరం.ఆ కుర్రవాడ్ని పోలీసులు చితకబాదారని అందుకే చనిపోయాడని ఛానల్స్ లో వచ్చింది.అయితే చితకబాదినమాట అవాస్తవం.అతనిపై ఒక దెబ్బ వేశారు.అతను సృహతప్పాడు.ఆస్పత్రికి వెళ్లిన తర్వాత మరణించాడు.ఇది నేను చెప్పిన మాట కాదు అతని తండ్రి ఆదాం చెప్పిన మాట.అతను పదిసంవత్సరాల క్రితంనుంచి గుండెజబ్బుతో బాధపడుతున్నాడు.బలహీనంగా ఉన్నాడు.అందువల్లే మరణించాడు.అతని కుటుంబానికి సహాయం చేయాలని ముఖ్యమంత్రిగారిని కోరడం జరిగింది.సిఎంఓ కూడా ఆదుకుంటామని చెప్పింది.పార్టీ తరపున కూడ ఆదుకుంటాం.ఇది జరిగిన వాస్తవం. సంఘటన జరగగానే పోలీసు విభాగం కూడా స్పందించింది.కొట్టిన ఎస్ ఐ ని సస్పెండ్ చేసింది.విచారణ చేస్తున్నారు.తప్పు చేస్తే సహించేది లేదు.వాస్తవాన్ని ప్రజలు గమనించాలని అంబటి రాంబాబు అన్నారు.