దోస్త్ మేరా దోస్త్
posted on Nov 3, 2012 @ 3:10PM
రాజకీయాల్లో శత్రుత్వం, మిత్రత్వం శాశ్వతం కాదనే సత్యాన్ని ములాయం, అమర్ సింగ్ మరో సారి నిరూపించారు. కొత్తగా పుట్టిన శత్రుత్వాన్ని మర్చిపోయి మళ్లీ పాత మిత్రులుగా మారిపోవాలని నిర్ణయించుకున్నారు. భాయీ భాయీ అంటూ ఇద్దరూ చేయిచేయి కలిపేసరికి మళ్లీ పాతరోజులు గుర్తొచ్చాయ్. కొత్త స్నేహానికి గుర్తుగా, అమర్ సింగ్ పై పెట్టిన మనీ ల్యాండరింగ్ కేసుల్ని ములాయం వెనక్కి తీసుకున్నారు.
ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రి. ములాయం జారీ చేసిన ఆదేశాల్ని అఖిలేష్ తో పాటు మొత్తం మంత్రులంతా శిరసావహించక తప్పదుమరి. రెండేళ్లక్రితం ములాయంతో అమర్ సింగ్ స్నేహానికి మిరియాలు పుట్టాయి. జయప్రదతోపాటు చాలామంది నేతలు అమర్ సాన్నిహిత్యాన్ని విడిచిపెట్టిపోయారు. తర్వాత అమర్ ఆరోగ్యంకూడా బాగా దెబ్బతిన్న నేపధ్యంలో పాత స్నేహాన్ని పునరుద్ధరించుకోవడంవల్లే లాభం ఉంటుందని అమర్ సింగ్ భావించారు.