కృష్ణా జలాలపై రాష్ట్రానికి షాక్
posted on Nov 29, 2013 @ 11:09AM
కృష్ణా జలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణా జలాలపై కర్నాటక ప్రభుత్వానికి అనుకూలంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ శుక్రవారం ఉదయం తీర్పును వెలువడించింది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతారలను ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. ఆల్మట్టి ఎత్తు పెంపును బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ సమర్థించింది. ఆంధ్రప్రదేశ్‌కు 1001 నుంచి 1005 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. జస్టిస్ బ్రిజేస్ కుమార్ నేతృత్వంలోని దిలీప్‌కుమార్ సేథ్, డీపీ దాస్‌లతో కూడిన ట్రిబ్యునల్ కృష్ణా జలాలపై తీర్పును వెలువడించింది. గెజిట్‌లో నమోదైనప్పటి నుంచి 2050 మే 31వ తేదీ వరకు ఈ తీర్పు అమలులో ఉంటుంది. ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడం పట్ల కర్ణాటక రాష్ట్రం హర్షం వ్యక్తం చేస్తోంది.