అయోధ్యపై అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది?
posted on Nov 9, 2019 9:03AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవ్వబోయే అయోధ్య తీర్పుపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సీజేఐ రంజయ్ గొగోయ్ తోపాటు జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ లు ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నారు.
వివాదాస్పద స్థలం 2.77 ఎకరాల భూమిలో రామ మందిరం ఉండేదని హిందువులు.... కాదుకాదు మసీదు ఉండేదని ముస్లింలు వాదిస్తున్నారు. అయితే, రామమందిరాన్ని కూల్చే అక్కడ మసీదును నిర్మించారని, ఆ ప్రాంతం రాముడు జన్మించిన నేల అంటూ హిందువులు అంటున్నారు. అయితే, అయోధ్య స్థల వివాదంపై దాఖలైన 4 సివిల్ దావాలపై అలహాబాద్ హైకోర్టు 2010లో కీలక తీర్పు ఇచ్చింది. ప్రధానంగా కక్షిదారులుగా ఉన్న ముగ్గురిని సమానంగా భూమిని పంచుకోవాలని జడ్జిమెంట్ చెప్పింది.
2.77 ఎకరాల వివాదాస్పద భూమిని.... సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ ఆఖాడా, రామ్ లల్లూ.... కలిసి పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇఛ్చిన తీర్పును... సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో 2011 మేలో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. అయితే, తొలుత మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించినా, ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.... 2016 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16 వరకు రోజువారీ విచారణ జరిపింది. తుది వాదనలు తర్వాత తీర్పును రిజర్వు చేసి.... దాదాపు 24రోజుల తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతోంది.