అక్బరుద్దీన్ ఓవైసీ ఓ దేశద్రోహి...అరెస్ట్ చేయండి: పాల్వాయి

 

 

 

 

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఓ దేశద్రోహి అని..మతం పేరుతో వైశమ్యాలు సృష్టిస్తూ హిందూ – ముస్లింల మధ్య కలహాలు రేపేందుకు ప్రయత్నిస్తున్నాడని..అతన్ని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టాలని” కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ఇటీవల పలు సభల్లో చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ సురేష్ రెడ్డి తెలిపిన వాదనే కాంగ్రెస్ వాదన అని, తెలంగాణకు కొందరు దోపిడీ దారులు తప్ప ఎవరూ అడ్డులేరని అన్నారు.


రాష్ట్ర విభజనను సీమాంధ్రనేతలెవరూ వ్యతిరేకించటం లేదన్నారు. హైదరాబాద్ను శాంతి భద్రతలు వంటి అంశాలను కేంద్రపరిధిలో ఉంచుకుని ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్లు అయితే సీమాంధ్రులకు అభ్యంతరం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చేంతవరకూ హైకమాండ్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు లాబీయింగ్ ఉంటుందన్నారు. పనిలో పనిగా మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పాల్వాయి ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి తెలంగాణ ద్రోహి అని అన్నారు. ఓ సారి తెలంగాణ అంటాడు, మరోసారి జగన్ పార్టీలోకి వెళ్తానంటాడు అని ఆయన ఎద్దేవా చేశారు.