ఏకే 47 మిస్ ఫైర్... గడ్డం నుండి తల బయటకి బులెట్..
posted on Jun 20, 2016 @ 11:32AM
ఏకే 47 గన్ మిస్ ఫైర్ అయి ప్రాణాలు కోల్పోయాడు శివకుమార్ అనే కానిస్టేబుల్. ఈఘటన బేగంపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శశికుమార్ అనే వ్యక్తి ఇటీవలే డిప్యుటేషన్‌పై గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉన్న ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే విధులు ముంగిచుకున్న అతను.. తన వద్దనున్న గన్ ను శుభ్రం చేస్తున్న.. క్రమంలో మిస్ ఫైర్ అయి బులెట్.. గడ్డం కింద నుండి తల భాగం నుండి బయటకు వచ్చింది. అంతే శశికుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది అతన్ని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అతని మృతదేహాన్ని నిమ్స్ మార్చురిలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా లేక.. ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.