అఫ్జల్‌గురు నిర్దోషి- చిదంబరం
posted on Feb 25, 2016 @ 10:40AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అఫ్జల్‌గురు ఉరితీత గురించి కాంగ్రెస్ నేత చిదంబరం వివాదాస్పద ప్రకటన చేశారు. 2001లో పార్లమెంటు మీద జరిగిన దాడిలో అఫ్జల్‌గురు దోషి అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవన్నారు చిదంబరం. ఒకవేళ ఆనాటి దాడిలో ఆఫ్జల్‌గురు పాత్ర ఉన్నా, అది ఏ స్థాయిలో ఉందో చెప్పలేమని అన్నారు. వెరసి అఫ్జల్‌గురుని ఉరి తీసేటన్ని సాక్ష్యాలు లేవంటూ పెదవి విరిచారు. మరి మీరు ఆ సమయంలో అధికారంలోనే ఉన్నారు కదా అన్న ప్రశ్నకు, తాను అధికారంలో ఉన్నప్పటికీ హోంశాఖ తన పరిధిలో లేదంటూ మాట దాటవేశారు. అంతేకాదు! జేఎన్‌యూలో జాతివ్యతిరేక నినాదాల గురించి కూడా ఇంతే భిన్నంగా స్పందించారు చిదంబరం- ఈ రోజుల్లో పిల్లలకి తప్పుగా మాట్లాడే అధికారం ఉందనీ, అంతమాత్రాన దాన్ని జాతి విద్రోహంగా భావించకూడదనీ పేర్కొన్నారు. హతవిధీ! ఇంతకీ చిదరంబరం వ్యాఖ్యల వెనుక ఉన్న చిదంబర రహస్యం ఏమిటో! సున్నితమైన అంశాన్ని మరింత రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిని పొందటమేనా!