పాపం బ్రేకప్ చెప్దామనుకునేలోగా చంపేశాడు!
posted on Nov 19, 2022 @ 12:05PM
శ్రద్ధా వాకర్ దారుణ హత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. శ్రద్ధా వాకర్ ను మతం మారమని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ చేష్టలను శ్రద్ధావాకర్ సహించ లేకపోయారనీ, ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నదని తెలియవచ్చింది.
అఫ్తాబ్ తనను చిత్ర హింసలు పెడుతున్నారని ప్రెండ్స్ కు చెప్పుకుని ఏడ్చిన సందర్బాలున్నాయని కూడా ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. ఇక అఫ్తాబ్ తో సహజీవనం తన వల్ల కాదన్న నిర్ణయానికి వచ్చిన శ్రద్ధావాకర్..అతనితో బ్రేకప్ కు సిద్ధపడిందనీ. ఆమె అఫ్తాబ్ కు బ్రేకప్ చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేసిందనీ, ఒకటి రెండు రోజులలో ఆమే అఫ్తాబ్ తో సహజీవనానికి గుడ బై చెప్పి బయటకు వచ్చేస్తుందనగా, విషయం గ్రహించిన అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.
బ్రేకప్ చెప్పి శ్రద్ధా వాకర్ బయటకు వెడితే తన వికృత చేష్టలు బయటకు వచ్చి పరువు మంటకలుస్తుందన్న భయంతోనే ఆఫ్తాబ్ ఈ దారుణానికి ఒడిగట్టారని అంటున్నారు. అంతే కాకుండా డ్రగ్స్ మత్తులోనే శ్రద్ధాను చిత్ర హింసలకు గురి చేసి హత్య చేయడమే కాకుండా ఆమె శరీరాన్ని ముక్క ముక్కలుగా కోసేసినట్లు చెబుతున్నారు. గతంలో చాలా సార్లు శ్రద్ధా అఫ్తాబ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయబోయినా ఆత్మహత్య చేసుకుంటానని బెదరించి ఆమెను నిలువరించాడని శ్రద్ధా స్నేహితులు చెబుతున్నారు.