సీఎం ప్రధాన సలహాదారుగా సోమేష్.. తెలుగువన్ ఎప్పుడో చెప్పింది
posted on May 10, 2023 6:44AM
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కు ప్రభుత్వం కీలక పోస్టు కేటాయించింది. సీఎం కేసీఆర్ కు ప్రధాన సలహాదారుగా ఆయనను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో సోమేశ్ కుమార్ మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ప్రధాన సలహాదరుగా ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ . ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గా పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ గా ఉన్నారు. అనంతరం గిరజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా , 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. సోమేశ్ కుమార్ పనితీరుకు మెచ్చిన సీఎం కేసీఆర్ 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
అయితే ఏపీ కి కేటాయించిన ఆయన వెంటనే అక్కడకు వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో అక్కడికి వెళ్లి రిపోర్టు చేశారు. ఆ తరువాత స్వచ్చంధ పదవీ విరమణ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ సభలో సీఎం పక్కనే సోమేశ్ కుమార్ కనిపించారు. ఆలా ఉండగా సోమేష్ కుమార్ కు కేసీఆర్ ప్రభుత్వంలో కీలక పదవి కట్టబట్టే అవకాశం ఉందని తెలుగువన్ ముందే చెప్పింది. ఆయనకు సలహాదారు పదవి దక్కే అవకాశం ఉందని కూడా పేర్కొంది.
సోమేష్ కుమార్ కోర్టు తీర్పు కారణంగా తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఆయన అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన వెంటనే స్వచ్చంద పదవీ విరమణ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా సోమేష్ కుమార్ ఏపీలో రిపోర్టు చేసి ఆ తరువాత కొంత కాలానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంటనే తెలంగాణ సర్కార్ ఏదో ఒక పదవి ఇచ్చి అకామిడేట్ చేస్తుందని తెలుగువన్ అప్పుడే చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు సలహాదారు వంటి పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అప్పట్లోనే తెలుగువన్ చెప్పింది. తెలంగాణ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సయిజ్, కమర్షియల్ టాక్సెస్ కార్యదర్శిగానూ కొనసాగారు. ఇ
ప్పుడు కూడా ఆయనకు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్‌కు అప్పగిస్తారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ.. సోమేష్ కుమార్ తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయిన తరువాత కూడా ఇప్పటి వరకూ ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఎవరికీ అప్పగించకపోవడంతో సోమేష్ అనుభవం దృష్ట్యా ఆయననే చూసుకోమనే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎన్నికల సంవత్సరం కావడం, కేంద్రం నుంచి సహకారం కరవైన నేపథ్యం, కారణంగా సొంత ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో సోమేష్ కుమార్ కు రాష్ట్రానికి వనరులు సమకూర్చే బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు.