వైఎస్సార్సీపీ లోకి సమైక్యవాది అడుసుమిల్లి
posted on Apr 15, 2013 9:23AM
అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతున్న వైఎస్సార్సీపీ లోకి మరొక మాజీ టిడిపి, కాంగ్రెస్ అభిమాని అడుసుమిల్లి జయప్రకాష్ చేరుతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. టిడిపి ఆవిర్భావంతోటే (1983)విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన అడుసుమిల్లి జయప్రకాష్ త్వరలోనే వైఎస్సార్సీపీ లో చేరనున్నట్లు సమాచారం. 1994 నుంచి టిడిపి అర్భన్ అధ్యక్షుడిగా, 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పనిచేసిన అడుసుమిల్లి జయప్రకాష్ నాదెండ్ల టిడిపిలో నుంచి బయటకు వచ్చేసిన తరువాత కొన్ని రోజుల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. హరికృష్ణ ప్రోద్భలంతో తిరిగి టిడిపిలో చేరినా ఎన్నికల పొత్తులో భాగంగా బిజెపికి అవకాశం ఇవ్వడంతో అలిగిన అడుసుమిల్లి కాంగ్రెస్ అభిమానిగా, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు అడుసుమిల్లి జయప్రకాష్. తాజాగా కాంగ్రెస్ కు కూడా గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీ లో చేరనున్నట్లు తెలుస్తుంది.