సొంత పార్టీపైనే దుమ్మెత్తిపోసిన శశికళ..
posted on Aug 11, 2016 @ 10:25AM
అన్నాడీఎంకే ఎంపీ శశికళ పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డీఎంకే పార్టీ ఎంపీ చెంప చెళ్లుమనిపించిన నేపథ్యంలో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అయిన జయలలిత. దీనికితోడు ఆమెపై మరో ఫిర్యాదు అందింది పోలీసులకు. ఆమె ఇంట్లో పనిచేసే అమ్మాయి.. శశికళ కుటుంబం వేధిస్తుందని చెప్పి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు శశికళ తన సొంత పార్టీపైనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'నేను నాడార్ కులానికి చెందిన దాన్ని. భయపడేది లేదు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. నాకు అండగా నా కులం నిలుస్తుంది. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లోని బలమైన కమ్యునిటీల్లో నాడార్ కులం ఒకట'ని పుష్ప అన్నారు. అన్నాడీఎంకే పార్టీ బానిసల గుంపు అని.. బానిసల గుంపులో భాగం కావాలనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తనను వేధిస్తే నాడార్ సామాజిక వర్గం ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు.