నటుడు శోభన్‌బాబు అభిమానిగా వచ్చా: సీఎం
posted on Jul 1, 2012 @ 11:19AM
సినిమా పరిశ్రమ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం మద్దతిస్తుందని, ఆ సంగ తి చెప్పేందుకే వచ్చానని సీఎం కిరణ్ అన్నారు. తనకు శోభన్‌బాబుతో పరిచయం లేకపోయినా ఆయన అభిమానిగానే హాజరయ్యానన్నారు. శోభన్‌బాబు, తాను హీరోలు కాక ముందునుంచే మంచి మిత్రులమని, ఆయనతో తొలి పరిచయం రైల్లో జరిగిందని హీరో కృష్ణ చెప్పారు. తన 'తేనె మనసులు' సినిమా గురించి చెబితే పెద్ద హీరో అవుతావని ఆశీర్వదించినట్లు తెలిపారు.
సెక్యూరిటీ వాళ్లు అతి చేయడంవల్ల ఇబ్బందులకు గురైన వీవీఐపీలకు మా బావ శోభన్‌బాబు అభిమానుల తరఫున క్షమాపణలు చెబుతు న్నాను అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. శోభన్‌బాబు వజ్రోత్సవం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శనివారం రాత్రి వైభవంగా జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడారు. "రాముడు వనవాసానికి వెళ్లినా తిరిగిరాగానే ప్రజలు పట్టాభిషేకం చేశా రు. శోభన్ నటనకు దూరమైనా ఆయన అభిమానులు ఇలాంటి వేడుక చేయడం ఆనందంగా ఉంది. దిలీప్‌కుమార్ తర్వాత ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడు శోభన్. ఒకే ఏడాది ఎనిమిది శతదినోత్సవ చిత్రాలిచ్చిన హీరో అని ప్రశంసించారు.